- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సిన్
కేంద్రం రెండేళ్ల తరవాత మహిళలకు ఉచితంగా (HPV) human papillomavirus వ్యాక్సిన్ అందిస్తామని 2024 బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు దానిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రెండేళ్ల తరవాత మహిళలకు ఉచితంగా (HPV) human papillomavirus వ్యాక్సిన్ అందిస్తామని 2024 బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు దానిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ను నిరోదించడానికి ఇది తొలి అడుగుగా నిలుస్తుందని, రాబోయే కొద్దిరోజుల్లోనే దీనిని అమలు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం కింద 2027 నాటికి 2.6 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
స్వచ్ఛంధ సంస్థ GAVI సపోర్ట్ తో 1 కోటి కంటే ఎక్కువ వ్యాక్సిన్ లను భారత్‌కు సప్లై చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా 14ఏళ్లు పైబడిన బాలికలకు ఉచితంగా గార్డాసిల్ ఇంజక్షన్‌ను స్థానిక ఆరోగ్య కేంద్రాలలో ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధిస్తుంది. గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్ పీవీ టైప్ 16,18తో పాటు టైప్ 6,11 రకాల నుండి రక్షణ కల్పిస్తుంది.
వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించగలినట్టు పరిశోధనల్లో తేలింది. వ్యాక్సిన్ అందించడం ద్వారా ఇప్పటికే ప్రవేశపెట్టిన 160 దేశాల జాబితాలో ఇండియా చేరనుంది. ఇక ఈ వ్యాక్సిన్ ముందే అందించడం ద్వారా దేశంలోని లక్షలాది మంది మహిళల ప్రాణాలను కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ లో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ రూ.3వేల నుండి రూ.10వేల వరకు ఉంది. వయసు, డోసులను బట్టి కొన్ని ఆస్పత్రులు రూ.30వేల వరకు సైతం వసూలు చేస్తున్నాయి.






