భారతీయులకు అందుబాటులోకి వచ్చిన 12 నెలలపాటు ఉచిత ChatGPT సబ్‌స్క్రిప్షన్‌

by Malleboina Mahesh |   (  Updated:2025-11-04 07:35:47  IST  )

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో ప్రపంచ ప్రథమ స్థానంలో ఉన్న ఓపెన్‌ఏఐ (OpenAI) భారతీయ వినియోగదారుల కోసం సంచలన ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

భారతీయులకు అందుబాటులోకి వచ్చిన 12 నెలలపాటు ఉచిత ChatGPT సబ్‌స్క్రిప్షన్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో ప్రపంచ ప్రథమ స్థానంలో ఉన్న ఓపెన్‌ఏఐ (OpenAI) భారతీయ వినియోగదారుల కోసం సంచలన ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ChatGPT సేవలను మరింత విస్తృతంగా అందించాలనే ఉద్దేశంతో సంస్థ తాజాగా “ChatGPT Go” సబ్‌స్క్రిప్షన్‌ను భారత్‌లోని వినియోగదారులకు 12 నెలలపాటు పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఉచిత ఆఫర్‌ 2025 నవంబర్ 4 నుండి ప్రారంభమై, ఒక సంవత్సరం పాటు కొనసాగనుంది. దీని ద్వారా వినియోగదారులు అధిక మెసేజ్‌ పరిమితి, ఇమేజ్‌ జనరేషన్‌, ఫైల్‌ అప్‌లోడ్‌లు, వ్యక్తిగత మెమరీ ఫీచర్‌ వంటి ప్రీమియం సౌకర్యాలను పొందవచ్చు.

ఈ ఆఫర్‌ కొత్త వినియోగదారులతో పాటు ఇప్పటికే ChatGPT Go ఉపయోగిస్తున్నవారికీ వర్తిస్తుంది. ఓపెన్‌ఏఐ ప్రకటన ప్రకారం.. ఈ ఆఫర్‌ కేవలం భారతదేశంలో ఉన్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ తర్వాత ఎటువంటి అదనపు ఛార్జీలు విధించబడవని సంస్థ స్పష్టం చేసింది. అయితే, ఉచిత కాలం పూర్తయ్యాక సాధారణ సబ్‌స్క్రిప్షన్‌ రుసుములు తిరిగి అమలులోకి వస్తాయి. సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం భారత మార్కెట్లో ChatGPT వినియోగాన్ని మరింత పెంచుతుందని అంచనా. కృత్రిమ మేధస్సు ఆధారిత సేవలను సాధారణ ప్రజలకు చేరువ చేసే దిశగా ఓపెన్‌ఏఐ తీసుకున్న ఈ చర్యకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ పొందే విధానం

  1. ChatGPT వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ వేయండి.
  2. ప్రొఫైల్ ఐకాన్‌ను ఎంపిక చేసి “Upgrade Plan” - Settings → Subscription ఎంచుకోండి.
  3. కనిపించే “ChatGPT Go” ప్లాన్‌ను ఎంచుకొని ఆప్షన్‌ను యాక్టివేట్ చేయండి.
  4. అవసరమైతే, చెల్లింపు సమాచారం (కార్డ్/UPI) ఇవ్వండి — మొదటి ఏడాది ఛార్జ్ ఉండదు.
  5. యాక్టివేషన్ పూర్తైన తరువాత మీరు ChatGPT Go ఫీచర్లు (విస్తారమైన చాట్ లిమిట్స్, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్‌లు) వినియోగించవచ్చు.
Next Story