పురుషులకూ ఫ్రీ బస్‌.. ఉచితంగా ఫ్రిడ్జ్, స్టడీ లోన్ మాఫీ.. మరెన్నో : అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల

by Ramesh Naini |

ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది.

పురుషులకూ ఫ్రీ బస్‌.. ఉచితంగా ఫ్రిడ్జ్, స్టడీ లోన్ మాఫీ.. మరెన్నో : అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. అధికార డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) తమ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కె. పళనిస్వామి ఓటర్లను ఆకర్షించే దిశగా ఉచితాలు, సంక్షేమ పథకాలతో కూడిన మేనిఫెస్టోను తీసుకొచ్చారు.

మేనిఫెస్టోలోని ప్రధాన ఆకర్షణలు ఇవే..

ప్రతి కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేత, గృహ భారాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో.. బియ్యం రేషన్‌ కార్డున్న కుటుంబాల్లోని మహిళా పెద్దలకు ఉచితంగా రిఫ్రిజిరేటర్ల (ఫ్రిడ్జ్) పంపిణీ, ప్రస్తుతం మహిళలకు అమలు చేస్తున్న మాదిరిగానే, పురుషులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, యువతను, విద్యార్థులను ఆకర్షించేలా.. వారు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యా రుణాల పూర్తి మాఫీ, 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాల కొనుగోలుపై రూ. 25 వేల రాయితీ, వృద్ధులు, ఇతర అర్హులకు ఇచ్చే సామాజిక పింఛన్ల మొత్తాన్ని రూ. 2,000కు పెంపు.

కమిషన్, కలెక్షన్, కరప్షన్ : పళనిస్వామి

మేనిఫెస్టో విడుదల సందర్భంగా పళనిస్వామి అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే పాలన అంతా ‘కమిషన్, కలెక్షన్, కరప్షన్’ అన్నట్లుగా సాగుతోందని, అవినీతి బాగా వేళ్లూనుకుపోయిందని ఆరోపించారు.

Next Story