ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సార్కోజీకి ఐదేళ్ల జైలు, లక్ష యూరోల ఫైన్!

by Phanindra |

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సార్కోజీకి ఐదేళ్ల జైలు, లక్ష యూరోల ఫైన్ విధించారు. లిబియా నుంచి అక్రమంగా నిధులు సేకరించారనే కేసులో ఈ శిక్ష వేశారు.

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సార్కోజీకి ఐదేళ్ల జైలు, లక్ష యూరోల ఫైన్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సార్కోజీకి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. తన ఎన్నికల ప్రచారానికి లిబియా నుంచి అక్రమంగా నిధులు సేకరించారనే కేసులో ప్యారిస్‌కు చెందిన కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. అప్పట్లో అంతర్జాతీయంగా ఏకాకిగా మారిన లిబియా దేశాధ్యక్షుడు గడాఫీతో సార్కోజీ ఈ డీల్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. లిబియాకు తాను మద్దిస్తాననే హామీతో ఎన్నికల ప్రచారం కోసం అక్రమంగా నిధులు సేకరించినట్లు సార్కోజీపై కేసులు పెట్టారు. ఈ ఆరోపణలను సార్కోజీ ఖండిస్తూనే వచ్చారు. అయితే తాజాగా ప్యారిస్‌కు చెందిన ఒక కోర్టు మాత్రం.. ఆయన్ను దోషిగా తేల్చి, ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. అలాగే లక్ష యూరోల జరిమానా కూడా విధించింది.

Next Story