Deportation: భారత్‌కు నాలుగో బ్యాచ్ వలసదారులు.. పనామా నుంచి ఎందుకు వచ్చారు?

by Mahesh Kanagandla |   (  Updated:2025-02-23 19:46:57  IST  )

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 12 మంది భారతీయులు పనామా మీదుగా ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. వీరంతా టర్కీకి చెందిన ఓ విమానసంస్థ ఫ్లైట్‌లో పనామా నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు.

Deportation: భారత్‌కు నాలుగో బ్యాచ్ వలసదారులు.. పనామా నుంచి ఎందుకు వచ్చారు?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోకి అక్రమంగా(Illegal Immigrants) ప్రవేశించిన 12 మంది భారతీయులు(Illegal Citizens) పనామా(Panama) మీదుగా ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. వీరంతా టర్కీ(Turkish Airlines)కి చెందిన ఓ విమానసంస్థ ఫ్లైట్‌(Commercial Flight)లో పనామా నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. అంటే.. ఈ డిపోర్టేషన్‌(Deportation)లో 12 మంది మిలిటరీ ఫ్లైట్‌లో కాకుండా సివిల్ ఫ్లైట్‌లో స్వదేశానికి వచ్చారు. ఇందులో నలుగురు పంజాబీలు, ముగ్గురు హర్యానా, మరో ముగ్గురు యూపీ వాసులు ఈ 12 మందిలో ఉన్నారు. ఢిల్లీ చేరిన తర్వాత నలుగురు పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ఫ్లైట్‌లో వెళ్లిపోయారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా 104 మంది భారతీయులను ఫిబ్రవరి 5న మిలిటరీ ఫ్లైట్‌లో కాళ్లు, చేతులు బంధించిన స్థితిలో పంపించారు. ఆ తర్వాత మరో రెండు సార్లు డిపోర్టేషన్ జరిగింది. చివరి బ్యాచ్‌లో మహిళలను నిర్బంధించలేదు. తొలి మూడు బ్యాచ్‌లలో మొత్తంగా 332 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది. ముందటి బ్యాచ్‌లవలె నాలుగో బ్యాచ్ మాత్రం నేరుగా అమెరికా నుంచి భారత్‌కు రాలేదు. గతవారం అమెరికా పలుదేశాలకు చెందిన 299 మంది అక్రమ వలసదారులను పనామాకు పంపింది. వారిని పనామాలో హోటల్‌లో ఉంచారు. తాజాగా, అందులో నుంచి 12 మంది భారతీయులను కమర్షియల్ ఫ్లైట్‌లో ఇండియాకు పంపారు. ఆ 299 మందిలో ఎంతమంది భారతీయులు ఉన్నారనేది తెలియదు. అయితే 299 మందిలో 171 మంది స్వదేశాలకు వెళ్లడానికి నిరాకరిస్తున్నట్టు తెలిసింది.

ఖర్చు అమెరికాదే

తొలుత అక్రమ వలసదారులను అమెరికా నేరుగా ఆ దేశాలకు మిలిటరీ ఫ్లైట్‌లో పంపింది. తర్వాత పనామా, కోస్టారికా దేశాలతో అమెరికా ఓ డీల్ కుదుర్చుకుంది. వేరే దేశాల అక్రమ వలసదారులను ఈ ‘బ్రిడ్జీ’ దేశాలకు చేర్చుతారు. అక్కడి నుంచి వారు స్వదేశాలకు వెళ్లిపోవాలి. ఆయా దేశాలు తమ పౌరులను స్వీకరించని, స్వదేశాలకు వెళ్లడానికి నిరాకరించిన అక్రమ వలసదారులను కూడా అమెరికా ఈ దేశాలకు పంపుతున్నది. అక్కడ ప్రత్యామ్నాయాలపై చర్చలు, యూఎన్ జోక్యమూ చేసుకునే అవకాశాలున్నాయి. ఈ అక్రమ వలసదారులు వారి స్వదేశానికి పంపడానికి సంబంధించిన ఖర్చునంతా అమెరికానే భరిస్తుంది. పనామా, కోస్టారికాలు కేవలం ఒక టెంపరరీ హాల్ట్‌గా మాత్రమే ఉపయోగపడుతాయి. మిలిటరీ ఫ్లైట్‌లో అక్రమ వలసదారులను వారి దేశాలకు తీసుకెళ్లడమే అధిక వ్యయభారం. మిలటరీ ఫ్లైట్ కావడం, ఇంధనం, అందులో వలసదారులతో వెంట ప్రయాణించే మిలిటరీ.. ఇతరత్ర కారణాలతో భారం ఎక్కువవుతంది. ఇలా రెండు సెంట్రల్ అమెరికన్ దేశాలకు మూకుమ్మడిగా అక్రమ వలసదారులను పంపి అక్కడి నుంచి వారి స్వదేశాలకు పంపడం.. డిపోర్టేషన్‌లో సమస్యలను మిటిగేట్ చేయడం అమెరికాకు మంచి ఆప్షన్‌గా ఉన్నది. చౌక కూడా.

Next Story