మెరుపు వరదలు.. నలుగురు మృతి, 60 మంది గల్లంతు

by Gantepaka Srikanth |

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో వరదలు(Floods) బీభత్సం సృష్టించాయి.

మెరుపు వరదలు.. నలుగురు మృతి, 60 మంది గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో వరదలు(Floods) బీభత్సం సృష్టించాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. దీంతో ఖీర్ గంగానది ఉప్పొగి.. ఉధృతంగా ప్రవహించింది. ఈ అనూహ్య వరదలతో పాటు కొండ చరియలు విరిగిపడి ధరాలీ గ్రామం మొత్తం చెల్లాచెదురైంది. నలుగురు(Four People Died) మృతిచెందగా, 60 మంది గల్లంతు అయ్యారు. ఎక్కడికక్కడ ఇళ్లు, కుప్పకూలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, 20-25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయి ఉండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story