Uttarakhand: ఉత్తరాఖండ్‌ మంచుచరియల బాధితుల్లో నలుగురు మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-01 10:04:26  IST  )

గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో మంచు కురుస్తుండటంతో శుక్రవారం భారీగా మంచు చరియలు (Avalanche) విరిగిపడిన సంగతి తెలిసిందే.

Uttarakhand: ఉత్తరాఖండ్‌ మంచుచరియల బాధితుల్లో నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో మంచు కురుస్తుండటంతో శుక్రవారం భారీగా మంచు చరియలు (Avalanche) విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు (BRO) చెందిన 55 మంది కార్మికులు మంచు కొండల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ టీం ఇప్పటికే 33 మందిని రక్షించగా, తాజాగా మరో 14 మందిని రక్షించింది. ఏడు అడుగుల లోతైన మంచులో కూరుకుపోయిన వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.

ప్రస్తుతం కాపాడిన 14 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని భారత ఆర్మీ చెప్పింది. వారిని హెలికాప్టర్‌లో జోషిమఠ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. అయితే, శుక్రవారం కాపాడిన వారిలో నలుగురు మృతిచెందినట్లు వెల్లడించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారని తెలిపింది. ఇంకా మంచులోనే మరో ఆరుగురు కార్మికులు చిక్కుకుని ఉండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story