- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీరని విషాదం.. పుచ్చకాయ తిని కుటుంబంలోని నలుగురి మృతి!
బిర్యానీ, పుచ్చకాయ తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హాయిగా బిర్యానీ తిని ఆ తర్వాత పుచ్చకాయ ఆరగించి పడుకున్న ఓ కుటుంబం తెల్లారేసరికి శవాలుగా మారారు. పెను విషాదం నింపిన ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం పైధోనీ ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్దుల్లా డోకాడియా (40) కుటుంబం ఏప్రిల్ 25న ఇంట్లోనే బంధువులను ఆహ్వానించి చిన్న పార్టీ చేసుకుంది. పార్టీలో భాగంగా బిర్యానీ ఆరగించారు. అనంతరం అర్ధరాత్రి వేళ పుచ్చకాయ తిన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అబ్దుల్లా కుటుంబంలోని ఒక్కొక్కరు తీవ్ర అస్వస్థతకు గురికావడం మొదలైంది. వాంతులు, తల నొప్పి కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. ఆదివారం ఉదయానికల్లా అబ్దుల్లా ఇద్దరు కూతుళ్లు అయేషా (16), జైనాబ్(13) అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా భార్యభర్తలిద్దరూ స్థితిలోకి వచ్చారు. వారిని గుర్తించిన ఇరుగు పొరుగు వాళ్లు వెంటనే వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యుదులు ఇద్దరు కుమార్తెలు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించగా అబ్దుల్లా అతడి భార్య నస్రీన్ చికిత్స పొందుతూ చనిపోయారు. అనుమానాస్పద మరణాల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని గంటలకు ముందు హాయిగా గడిపిన కుటుంబం అంతలోనే ఇలా తిరిగి రాని కోకాలకు వెళ్లడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.






