- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
చత్తీస్ గఢ్(Chhattisgarh)అడవులు మళ్లీ నెత్తురోడాయి. భూపాలపట్నం, మద్దేడు ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టిన క్రమంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పు(Encounter)ల్లో నలుగురు మావోయిస్టు(Four Maoists)లు మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్ : చత్తీస్ గఢ్(Chhattisgarh)అడవులు మళ్లీ నెత్తురోడాయి. భూపాలపట్నం, మద్దేడు ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టిన క్రమంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పు(Encounter)ల్లో నలుగురు మావోయిస్టు(Four Maoists)లు మృతి చెందారు. ఘటనాస్థలిలో పోలీసులు పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇప్పటికే దాదాపు 250మందికి పైగా నక్సల్స్ ను భద్రతా బలగాలు హతమార్చాయి. వందలాది మంది లొంగిపోయారు. నిత్యం భారీ ఎత్తున మావోల కోసం కూంబింగ్ చేస్తుండటంతో ఎక్కడ ఎప్పుడు ఎన్ కౌంటర్ జరుగుతుందోనన్న టెన్షన్ మధ్య ఆదివాసీలు బిక్కుబిక్కుమంటు జీవిస్తున్నారు.
అటు భద్రతా బలగాలను టార్గెట్ చేసిన మావోయిస్టులు చత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లా అబుజ్మద్ లో అమర్చిన 4ఐఈడీలను భద్రతా బలగాలు గుర్తించాయి. 5 కిలోల చొప్పున 20 కిలోల ఐఈడీలు లభ్యం కాగా, వాటిని బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది.






