- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING : గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు మావోలు హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli Encounter)లో భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli Encounter)లో భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఘటనా ప్రాంతంలో ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, రెండు 303 రైఫిల్స్, ఒక భార్మర్, వాకీ టాకీలు, క్యాంపింగ్ మెటీరియల్ వంటి వాటిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇటీవల ప్రారంభించిన FOB కవండే సమీపంలోని మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టు సమూహాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో.. అడిషినల్ ఎస్పీ రమేష్, 300 కమాండోలు, CRPF విభాగం నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షంలో ఆపరేషన్ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం మావోయిస్టులు C60 కమాండోలపై విచక్షణారహితంగా కాల్పులు చేయగా.. వాటిని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు కొనసాగగా.. నలుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించినట్లు గడ్చిరోలి పోలీసులు తెలిపారు.






