Uttarakhand : వరదలో కొట్టుకు పోయిన కారు.. నలుగురు మృతి

by Muthe.Rajitha |

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని హల్ద్వానీ జిల్లా(Haldwani District)లో బుధవారం తీవ్ర విషాదం నెలకొంది.

Uttarakhand : వరదలో కొట్టుకు పోయిన కారు.. నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని హల్ద్వానీ జిల్లా(Haldwani District)లో బుధవారం తీవ్ర విషాదం నెలకొంది. గత మూడురోజులుగా హల్ద్వానీ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువలో కారు అదుపుతప్పి పడిపోయింది(Car Plunges). దీంతో అందులో పయనిస్తున్న నలుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతి చెందిన వారిలో నాలుగు రోజుల నవజాత శిశువు కూడా ఉండటం స్థానీకులను కలచి వేసింది.

కారు కాలువలో పడిన వెంటనే కొంత దూరం కొట్టుకుపోయి, ఒక కల్వర్ట్‌లో చిక్కుకుపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కారును కాలువ నుంచి బయటకు తీసి, విండ్‌షీల్డ్‌ను పగలగొట్టి మృతదేహాలను, గాయపడినవారిని బయటికి తీశారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని హల్ద్వానీ సిటీ ఎస్పీ ప్రకాశ్ చంద్ర తెలిపారు. కారు, ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నామని ఎస్పీ వివరించారు.

Next Story