- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్‌లో వంతెన కూలిన ఘటన.. నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
గుజరాత్ (Gujarat)లోని వడోదరాలో వంతెన కూలిన ఘటనలో (Vadodara Bridge Collapse Incident) 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ (Gujarat)లోని వడోదరాలో వంతెన కూలిన ఘటనలో (Vadodara Bridge Collapse Incident) 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజినీర్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై లోతైన విచారణ చేయాలని ఉన్నతస్థాయి కమిటీ వేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇతర వంతెనలపై యుద్ధప్రాతిపదికన క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని ఓ ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో వడోదర డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్ఎం నాయకవాలా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు యూసీ పటేల్, ఆర్టీ పటేల్, అసిస్టెంట్ ఇంజినీర్ జేవీ షా ఉన్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.
వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న ముజ్ పూర్ - గంభీర వంతెన శ్లాబ్ కూలిపోవడంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా.. 8 మందికి గాయాలయ్యాయి. గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.






