- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ నుండి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్!
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. స్పీకర్ బిమన్ బంద్యోపాధ్యాయ చీఫ్ విప్ శంకర్ ఘోష్ సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. స్పీకర్ బిమన్ బంద్యోపాధ్యాయ చీఫ్ విప్ శంకర్ ఘోష్ సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అశోక్ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ఫుటేజ్ తొలగించడాన్ని నిరసిస్తూ 40 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. కాగా సోమవారం మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు పదే పదే అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ వారిని వాదించినా వినకపోవడంతో ఎమ్మెల్యేలు ఘోష్, అగ్రిమిత్ర పాల్, దీపక్ బర్మాన్, మనోజ్ ఒరాన్‌లను సస్పెండ్ చేశారు. స్పీకర్ మాట వినకపోవడంతో పాటు టేబుళ్లను కొట్టడం, మైక్రోఫోన్‌లను కొట్టడం, పేపర్లు చింపివేయడం మంచి ప్రవర్తన కాదని స్పీకర్ భావించారు. నలుగురు ఎమ్మెల్యేలను సస్సెండ్ చేయడంతో మిగితా బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌంట్ చేసి మరో 20 నిమిషాలు నిరసన తెలిపారు.






