- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ వైస్ ప్రెసిడెంట్ హారిస్ భద్రత తొలగింపు.. వైట్‌హౌస్ వర్గాల అధికారిక ప్రకటన
సంచలన నిర్ణయాలతో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సంచలన నిర్ణయాలతో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris)కు కల్పిస్తున్న సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీ (Secret Service Security)ని రద్దు చేశారు. అయితే, ఇదే విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు నిజమేనని వెల్లడించాయి. అయితే, యూఎస్ చట్టాల ప్రకారం, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వారికి పదవి నుంచి వైదొలిగిన తరువాత కూడా జీవితాంతం సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీని కల్పించాల్సి ఉంటుంది. అయితే, వైస్ ప్రెసిడెంట్ విషయంలో ఆ నిబంధన వర్తించదు. పదవీ నుంచి వైదొలిగిన తరువాత వారికి కేవలం 6 నెలల వరకు మాత్రమే సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీని కల్పిస్తారు. ఇదే సయయంలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సీక్రెట్ సర్వీస్ రక్షణను పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.






