Sukhdev Singh Dhindsa:కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

by Ajay Maddhiboyina |

పంజాబ్ రాజ‌కీయాల్లో సుదీర్ఘ సేవ‌లు అందించిన‌ కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా (89) కన్నుమూశారు. మొహాలీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు కుటుంబ స‌భ్యులు ప్ర‌క‌టించారు.

Sukhdev Singh Dhindsa:కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
X

దిశ‌, వెబ్ డెస్క్: పంజాబ్ రాజ‌కీయాల్లో సుదీర్ఘ సేవ‌లు అందించిన‌ కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా (89) కన్నుమూశారు. మొహాలీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు కుటుంబ స‌భ్యులు ప్ర‌క‌టించారు. గ‌త కొన్ని నెల‌లుగా ఆయ‌న ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆరోగ్యం విష‌మించ‌డంతో గ‌త కొన్ని రోజులుగా వెంటిలేట‌ర్ పై ఉన్నారు. ఆరోగ్యం మరింత క్షీణించ‌డంతో నేడు క‌న్నుమూశారు.

వాజ్‌పేయి హయాంలో క్రీడలు, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా ధిండ్సా సేవలు అందించారు. 1936లో ఆయ‌న జ‌న్మించ‌గా రాజ‌కీయ జీవితం అంతా పంజాబ్ ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే సాగింది. ఆయ‌న గ‌తంలో శిరోమ‌ణి అకాలీద‌ళ్ సంయుక్త పార్టీకి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. కేంద్ర‌మంత్రిగా ఉన్న స‌మ‌యంతో త‌న ప‌నితీరుతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. 2004లో కేంద్రం ఆయ‌న‌ను ప‌ద్మ‌శ్రీతో స‌త్క‌రించి గౌరవించింది. ఇక ఆయ‌న మృతితో ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Next Story