- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి రాజెన్ గోహెన్ సహా 17 మంది
మాజీ కేంద్ర మంత్రి, అస్సాంలోని నాగావ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపిగా ఎన్నికైన రాజెన్ గోహెన్ ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, అస్సాంలోని నాగావ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపిగా ఎన్నికైన రాజెన్ గోహెన్ (Razen Gohan) ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు మరో 17 మంది సభ్యులు కూడా బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు అస్సాం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియాకు రాసిన లేఖలో, గోహేన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు, తక్షణమే అమల్లోకి వచ్చేలా అన్ని పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గోహేన్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ "అస్సాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైంది. బయటి వ్యక్తులను రాష్ట్రంలో స్థిరపడటానికి అనుమతించడం ద్వారా స్థానిక వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. రాజెన్ గోహెన్ 1999 నుంచి 2019 వరకు నాలుగు పర్యాయాలు నాగావ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2016 నుంచి 2019 వరకు రైల్వే కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన రాజీనామాతో అస్సాం బీజేపీకి గట్టి షాక్ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.






