పంజాబ్ మాజీ CM ప్రకాష్ సింగ్‌ బాదల్‌కు తీవ్ర అస్వస్థత

by Disha Web Desk 19 |
పంజాబ్ మాజీ CM ప్రకాష్ సింగ్‌ బాదల్‌కు తీవ్ర అస్వస్థత
X

దిశ, డైనమిక్ బ్యూరో: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్(95) అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఆదివారం మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఆరోగ్య పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘ప్రకాష్ సింగ్ బాదల్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిసి ఆందోళన చెందుతున్నాను. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో ఆయన ఆరోగ్యం గురించి ఫోన్‌లో చర్చించాను. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed