ఐసీయూలో మాజీ ప్రధాని.. వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతోన్న చికిత్స

by Kema Shiva Kumar |

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‌పీ (BNP) అధ్యక్షురాలు బెగుమ్ ఖలిదా జియా (Begum Khaleda Zia)కు గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడింది.

ఐసీయూలో మాజీ ప్రధాని.. వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతోన్న చికిత్స
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‌పీ (BNP) అధ్యక్షురాలు బెగుమ్ ఖలిదా జియా (Begum Khaleda Zia)కు గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి ఢాకాలోని ఎవర్‌కేర్ (Evercare) హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ సందర్భంగా ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ.. బెగుమ్ ఖలిదా జియాకు యాంటీబయాటిక్స్‌తో తక్షణ చికిత్స అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉందని, త్వరలోనే మెరుగుపడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా బెగుమ్ ఖలిదా జియా చికిత్సకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్ నిపుణులు వర్చువల్‌గా సాయం అందిస్తున్నారు. బీఎన్‌పీ నాయకులతో పాటు సుమా షమీలా రహ్మాన్ తదితరులు ఆసుపత్రి వద్దే ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

Next Story