ప్రధాని మోడీని కలిసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌..

by Ramesh Naini |

భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా ప్రారంభించిన ప్రధానమంత్రి కార్యాలయం 'సేవా తీర్థ'లో ఈ భేటీ జరిగింది.

ప్రధాని మోడీని కలిసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌..
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా ప్రారంభించిన ప్రధానమంత్రి కార్యాలయం (PMO)'సేవా తీర్థ'లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ప్రధానితో భేటీ అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘నూతన ప్రధానమంత్రి కార్యాలయం 'సేవా తీర్థ'లో ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఆనందంగా ఉంది. ఈ భవనం నిజంగా 'నాగరిక్ దేవో భవ' అనే స్ఫూర్తిని చాటుతోంది. సేవ, కరుణ, కర్తవ్యం మరియు 'దేశమే ప్రథమం' (Nation First) అనే భావనలకు ఇది ఒక పవిత్ర వేదిక’ అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీ స్పందన..

మాజీ రాష్ట్రపతితో జరిగిన సమావేశంపై ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. వివిధ అంశాలపై ఆయనకు ఉన్న అవగాహన, ఇచ్చే సలహాలు ఎప్పుడూ లోతైనవిగా, ఎంతో విజ్ఞానదాయకంగా ఉంటాయి’ అని మోడీ ట్వీట్ చేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story