- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ranil Wickramasinghe: కొంప ముంచిన భార్య.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్ అయ్యారు. దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2023 సెప్టెంబర్ లో తన భార్య స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇంగ్లాండ్ కు వెళ్లడానికి ప్రజా నిధులను ఆయన వినియోగించారని అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సీఐడీ) అతడిని అరెస్టు చేసింది. కోలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ ముదు హజరుపరచబోతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
ప్రైవేట్ కార్యక్రమం వివాదం:
2023 లో హవానాలో జరిగిన జీ77 శిఖరాగ్ర సమావేశానికి విక్రమసింఘే హాజరయ్యారు. అయితే అక్కడి నుంచి తిరిగి వస్తూ ఆయన తన భార్యతో కలిసి ఇంగ్లాండ్ లోని వోల్వర్‌హాంప్టన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ పర్యటనపై వివాదం రాజుకుంది. అయితే తన భార్య ప్రయాణ ఖర్చులను ఆమెనే భరించిందని ప్రభుత్వం నిధులు ఏవీ ఉపయోగించలేదని విక్రమసింఘే వాదించారు. కానీ సీఐడీ మాత్రం విక్రమసింఘే తన ప్రైవేట్ పర్యటన కోసం ప్రభుత్వ డబ్బును ఉపయోగించారని అతని అంగరక్షకులకు కూడా రాష్ట్రం జీతాలు ఇచ్చిందని సీఐడీ ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఇవాళ ఆయనను అరెస్టు చేశారు.
రణిల్ విక్రమసింఘే?
2022 లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక ప్రజలు పాలకులపై తిరగబడ్డారు. దేశంలో సమస్య పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ భారీగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. నాటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందని ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళన క్రమంగా రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రజాఆందోళనకు భయపడిపోయిన రాజపక్సే దేశం విడిచి పోరిపోయరు. ఈ రాజపక్ష తర్వాత 2022లో జులైలో విక్రమసింఘే దేశాధిక్షుడిగా ఎన్నికయ్యారు. 2022లో దేశం చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక మాంద్యం తర్వాత ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించిన ఘనత విక్రమసింఘేకే దక్కింది. సెప్టెంబర్‌లో విక్రమసింఘే తిరిగి ఎన్నిక కోసం పోటీ చేసి ఓడిపోయారు.






