- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగో విమానం గాల్లో ఉండగా అస్వస్థత.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే
విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికురాలికి మాజీ ఎమ్మెల్యే సీపీఆర్ చేసి కాపాడిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికురాలికి మాజీ ఎమ్మెల్యే సీపీఆర్ చేసి కాపాడిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో ఉన్న ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ వెంటనే స్పందించారు. బాధితురాకిలి సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడారు. డాక్టర్ అంజలి నింబాల్కర్ చర్యపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ అంజలిపై సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో ప్రశంసలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే డా. అంజలి చూపిన అపూర్వమైన అప్రమత్తత, కరుణ గురించి తెలుసుకుని ఎంతో హృదయాన్ని తాకింది, గర్వంగా అనిపించిందని తెలిపారు.
ప్రయాణ మధ్యలో ఒక అమెరికన్ మహిళకు వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు, డా. అంజలి వెంటనే స్పందించి సమయోచితంగా సీపీఆర్ అందించి ప్రాణాన్ని కాపాడారని తెలిపారు. అయితే, ఆమె వైద్య వృత్తిని విరమించి, ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ, ఆ క్షణంలో ఆమెలోని వైద్యురాలు ఎలాంటి ఆలోచన లేకుండా ముందుకు వచ్చిందని కొనియాడారు. ఈ నిస్వార్థమైన చర్య వృత్తి నైపుణ్యానికే కాదు, మానవత్వం, సేవాభావం, బాధ్యత అనే గొప్ప విలువలకు ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. ట్వీట్ ఇదే..






