దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ సీఎం కన్నుమూత

by Malleboina Mahesh |   (  Updated:2025-09-13 03:26:50  IST  )

మేఘాలయ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించిన మాజీ ముఖ్యమంత్రి డాన్‌వా డెత్వెల్‌సన్ (డి.డి.) లాపాంగ్ ఈ రోజు కన్నుమూశారు.

దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ సీఎం కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మేఘాలయ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించిన మాజీ ముఖ్యమంత్రి డాన్‌వా డెత్వెల్‌సన్ (డి.డి.) లాపాంగ్ (Danwa Deathwellson Lapang) ఈ రోజు కన్నుమూశారు (passed away). ఆయన శుక్రవారం అర్థరాత్రి తర్వాత షిల్లాంగ్‌లోని బెథనీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వయసు 91 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన గత కొంత కాలంగా వృద్ధాప్య కారణాలతో ఇబ్బంది పడుతూ.. తుదిశ్వాస విడిచారు. 1972 లోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన లాపాంగ్, నాలుగుసార్లు మేఘాలయ ముఖ్యమంత్రి (Four-time Chief Minister of Meghalaya)గా సేవలు అందించారు. 1992 నుంచి 2008 మధ్య ఆయన పలు దఫాలుగా సీఎం పదవిని చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడిగా కొనసాగిన ఆయనను మేఘాలయ రాజకీయాల్లో ఒక అనుభవజ్ఞుడి గా గుర్తిస్తారు. ఆయన మరణంతో రాష్ట్రంలో రాజకీయ వర్గాలు, ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Next Story