ట్విషా మృతి కేసులో కీలక పరిణామం.. మాజీ జడ్జి అరెస్ట్

by Naga Rani Yarlagadda |

యువ నటి, మోడల్ ట్విషా శర్మ (33) మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ట్విషా మృతి కేసులో కీలక పరిణామం.. మాజీ జడ్జి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: యువ నటి, మోడల్ ట్విషా శర్మ (33) మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె అత్త, మాజీ జడ్జి అయిన గిరిబాల సింగ్ ను భోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ ఆమెను అరెస్ట్ చేసే వీల్లేకుండా యాంటిసిపేటరీ బెయిల్ ఉండటంతో.. పోలీసులు అరెస్ట్ చేయడం వీలుకాలేదు. నిన్న అర్థరాత్రి మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి దేవనారాయణ్ మిశ్రా..రెండు పిటిషన్లపై విచారణ చేపట్టారు. ట్విషా తండ్రి నవనిధి శర్మ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆమె శరీరంపై ఉన్న గాయాల గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబం చేస్తున్న ఆరోపణలు పట్టించుకోకుండా బెయిల్ మంజూరు చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ ఆమె బెయిల్ ను రద్దు చేయాలని కోరగా.. వెంటనే ఆమెకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేశారు. నిజనిజాలు తెలియాలంటే గిరిబాల ను కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉంటుందని సీబీఐ కోర్టుకు వివరించింది. కోర్టు బెయిల్ రద్దు చేయడంతో.. గిరిబాలను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నెల 25న సిట్ నుంచి ఈ కేసును తీసుకున్న సీబీఐ.. ట్విషా భర్తను ప్రశ్నిస్తోంది. రేపటితో అతనికి సీబీఐ కస్టడీ ముగియనుండగా.. మరిన్ని రోజులు కస్టడీ ఇవ్వాలని కోరేందుకు సీబీఐ సిద్ధమవుతోంది.

Next Story