- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దూరం.. ఆ పర్వత శ్రేణిలో ధ్యానంలో మునిగిన మాజీ ఐపీఎస్
మొన్నటి వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై అధిష్టానం మేరకు ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలు దూరంగా ఉన్నారు. దీంతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైరాన్ నాగేంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: మొన్నటి వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా (President of Tamil Nadu BJP) వ్యవహరించిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై (Former IPS officer Annamalai) అధిష్టానం మేరకు ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలు దూరంగా ఉన్నారు. దీంతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైరాన్ నాగేంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేసుకుని అనేక పాదయాత్రలు నిర్వహించిన అన్నామలై.. బీజేపీ పార్టీకీ భారీ ఆధరణను తీసుకొచ్చారు. కానీ అనూహ్యంగా ఆయనను అధ్యక్ష పదవికి (Presidency) దూరం చేయడంతో ఒక్కసారిగా అంతా షాక్ కు గురయ్యారు. కానీ ఐపీఎస్ అధికారిగా దూకుడుగా వ్యవహిరించిన అన్నమలై సేవలను.. జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటామని, ఆయన సేవలు పార్టీకీ ఎంతో అవసరం అని కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పడంతో అంతా శాంతించారు.
దీంతో త్వరలో జరగబోయే జాతీయ అధ్యక్షుడి రేసు (presidential race)లో అన్నామలై ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అధ్యక్ష పదవి దూరం అయిన వెంటనే అన్నామలై ఉత్తరాఖండ్‌లోని ద్వారహత్ శ్రేణి (Dwarahat Range in Uttarakhand)లో మహాత్వర్ బాబాజీ గుహల వద్ద ప్రత్యక్షం అయ్యారు. రాజకీయ గందరగోళం అనంతరం ఆయన నిశ్శబ్దంలోకి ప్రవేశించారు. ఆయన మహాత్వర్ బాబాజీ గుహ క్రియా యోగ ఆధ్యాత్మికతకు ప్రసిద్ధమైన పవిత్ర స్థలంలో ధ్యానం (meditation) చేస్తూ కనిపించారు. ఈ గుహ ద్వారహత్ నుండి 25 కి మీ దూరంలో కుకుచ్చిన గ్రామం వద్ద దునాగిరి పర్వతంపై ఉంది. ఇది ధ్యానం, ఆధ్యాత్మిక శాంతికి అనువైన ప్రదేశం. ఈ గుహ యొక్క ప్రశాంత వాతావరణం రాజకీయ ఒత్తిడి నుండి విముక్తి కోసం అన్వేషించే వారికి ఆకర్షణీయమైన ప్రదేశంగా ఉంటుంది.






