- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవర్‌గా మారిన మాజీ డిప్యూటీ సీఎం: సోషల్ మీడియాలో వీడియో వైరల్
బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్ డ్రైవర్ అవతారమెత్తారు. వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలోని ససారంలో కొనసాగుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్ డ్రైవర్ అవతారమెత్తారు. వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలోని ససారంలో కొనసాగుతోంది. అక్కడ తేజస్వీ యాదవ్ యాత్రకు మద్దతు తెలిపారు. అక్కడి నుంచి శుక్రవారం యాత్ర ప్రారంభం కాగా.. తేజస్వీ స్వయంగా జీపు నడుపుతూ రాహుల్‌తో ముచ్చటించారు. ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం జీపులో వెనక ఉన్నారు. ఈ పోటోలను తేజస్వీ ఎక్స్ లో పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండియా కూటమి నుంచి నితీశ్ కుమార్ వైదొలిగిన తర్వాత రాహుల్, తేజస్వి భేటీ కావడం ఇదే తొలిసారి. కైమూర్‌లోని దుర్గావతి బ్లాక్‌లోని ధనేచా వద్ద కైమూర్‌లో జరిగే బహిరంగ సభలో ఇద్దరూ పాల్గొననున్నట్టు తెలుస్తో్ంది. అనంతరం యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. యాత్ర యూపీలోకి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ యాత్రలో పాల్గొననున్నారు.






