- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ CM సిసోడియా అరెస్ట్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిసోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిసోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీబీఐ కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. తిహార్ జైలులో ఉన్న సిసోడియాను గత మూడు రోజులుగా ఈడీ ప్రశ్నిస్తోంది. గురువారం ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. మనీలాండరింగ్ అంశంపై మరింత విచారించేందుకు అరెస్ట్ చేశారు. కాగా సీబీఐ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్ పై రేపు కోర్టులో విచారణ జరగనుంది. మరో వైపు కవితను ఎల్లుండి ఈడీ ప్రశ్నించబోతోంది. ఈ నేపథ్యలో తాజాగా సిసోడియాను అధికారులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Next Story






