1984 Anti-Sikh Riots Case: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లల్లో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ

by Shamantha N |

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో(1984 Anti-Sikh Riots Case) కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్(Ex Congress MP Sajjan Kumar) ని ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది.

1984 Anti-Sikh Riots Case: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లల్లో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో(1984 Anti-Sikh Riots Case) కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్(Ex Congress MP Sajjan Kumar) ని ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. 1984లో సిక్కుల ఊచకోత సమయంలో సరస్వతి విహార్ ప్రాంతంలో జరిగిన రెండు హత్యలకు సజ్జన్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు కోర్టు వెల్లడించింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ తీర్పును ఇచ్చారు. అయితే, శిక్షమాత్రం ఖరారు చేయలేదు. ఫిబ్రవరి 18న శిక్ష కాలాన్ని నిర్ణయించనున్నారు. కేసు విచారణ సందర్భంగా సజ్జన్ కుమార్ ను తీహార్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు 1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరణ్ దీప్ సింగ్ ల హత్య జరిగింది. కాగా.. ఈ ఘటనపై పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ తర్వాత కేసుని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు అప్పగించారు. కాగా.. ఈకేసులో సజ్జన్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు డిసెంబర్ 16, 2021న కోర్టు అభియోగాలు మోపింది. అతనిపై ప్రాథమిక కేసు ఉన్నట్లు వెల్లడించింది.

ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారం

1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారీ స్థాయిలో సాయుధ గుంపులు రెచ్చిపోయాయి. వారు దోపిడీలు, హత్యలు, సిక్కులపై దాడులు నిర్వహించారు. అయితే జస్వంత్ సింగ్ భార్య ఫిర్యాదు ప్రకారం, దుండగులు అమె ఇంటిపై దాడి చేసి భర్త, కుమారుడిని హత్య చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రిని దోచుకుని, ఇంటిని తగలబెట్టారని తెలిపింది. అయితే, కోర్టు విచారణలో సజ్జన్ కుమార్ కేవలం ఈ ఘాతుకాలకు భాగస్వామి మాత్రమే కాకుండా, ఆ గుంపుకు నాయకత్వం వహించినట్లు ఆధారాలు లభించాయని తేలింది. దీంతో, అతడ్ని దోషిగా పేర్కొంది.

Next Story