- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే?
అస్సాం (Assam) మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత (Former CM Prafulla Kumar Mahanta) కుమార్తెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతుంది.

దిశ, వెబ్ డెస్క్: అస్సాం (Assam) మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత (Former CM Prafulla Kumar Mahanta) కుమార్తెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆమె ఓ వ్యక్తిని చెప్పుతో కొడుతూ.. అతడిపై తీవ్రంగా విరుచుకుపడుతూ కనిపిస్తుంది. ఈ సంఘటన డిస్పూర్‌లోని అత్యంత భద్రత కలిగిన ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్‌లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
సదరు వ్యక్తి గత కొన్నేళ్లుగా తన తండ్రి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని మహంత కుమార్తె తెలిపారు. అయితే, నిత్యం మద్యం తాగి వచ్చి తనతో దురుసుగా ప్రవర్తించేవాడని ఆరోపించింది. ఈ విషయమై గతంలో అనేకసార్లు అతడిని హెచ్చరించినట్లు తెలిపింది. అయితే, సోమవారం రోజు అతడు ఫుల్‌గా తాగి వచ్చి తన డోర్ కొట్టాడని, అందుకే అతడికి ఈ విధంగా బుద్ధి చెప్పినట్లు మహంత కూతురు వివరించింది. అయితే, అతడిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు.
కాగా, ప్రఫ్రుల్ల కుమార్ మహంత.. అస్సాం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ అయిన అసోం గణ పరిషత్ (AGP) సహ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు. ఆయన 1985 నుంచి 1990 వరకు, 1996 నుంచి 2001 వరకు రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక 2021లో తన పార్టీతో విభేదాల తర్వాత అతను అస్సాం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు .






