బ్రేకింగ్: కర్నాటక ఫలితాల వేళ మాజీ CM సిద్ధరామయ్య ఇంట్లో తీవ్ర విషాదం

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: కర్నాటక ఫలితాల వేళ మాజీ CM సిద్ధరామయ్య ఇంట్లో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి శివమ్మ భర్త రామే గౌడ (69) మృతి చెందారు. ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సిద్ధరామయ్య బావ రామేగౌడను చికిత్స నిమిత్తం మైసూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఓ పక్కా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ అధిక్యంలో దూసుకుపోతుండటంతో సంతోషంలో ఉన్న సిద్ధరామయ్య ఇంట్లో ఈ ఘటన ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటి కర్నాటకలో సంపూర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తుంది.

Also Read...

యూపీ సీఎం యోగీ హావా..17 స్థానాలకు బీజేపీ 16 లీడ్



Next Story

Most Viewed