మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-04 17:06:27  IST  )

జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా (87) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా (87) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే, ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah)కు మంగళవారం నుంచి పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇవాళ పరిస్థితి కాస్త విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. రేపు ఉదయం.. లేదా సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా త్వరగా కోలుకోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story