అధికారిక భవనాన్ని ఖాళీ చేసిన మాజీ సీజేఐ చంద్రచూడ్

by Phanindra |

సీజేఐ అధికారిక భవనాన్ని మాజీ సీజేఐ చంద్రచూడ్ ఖాళీ చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా అదే భవనంలో కొనసాగిన ఆయన తాజాగా ఖాళీ చేశారు.

అధికారిక భవనాన్ని ఖాళీ చేసిన మాజీ సీజేఐ చంద్రచూడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా వ్యక్తిగత కారణాలతో సీజేఐ అధికారిక నివాసంలోనే చంద్రచూడ్ కొనసాగుతూ వచ్చారు. ఇటీవలే కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాయగా.. దీనిపై చంద్రచూడ్ స్పందించారు. ఇది సమస్యగా మారడం బాధాకరమని చెప్పిన ఆయన.. తన సూట్‌కేసులు సర్దేసే ఉన్నాయని, త్వరలోనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తానని చెప్పారు. తను కుమార్తెల మెడికల్ కండీషన్ కారణంగా వేరే ఇల్లు దొరకలేదని, అందుకే అధికారిక భవనాన్ని ఖాళీ చేయలేదని అప్పట్లో ఆయన తెలిపారు. ఇక తాజాగా శనివారం నాడు అధికారిక భవనాన్ని చంద్రచూడ్ కుటుంబం ఖాళీ చేసింది.

Next Story