- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bill Gates: కేంద్రమంత్రి జేపీ నడ్డాతో బిల్ గేట్స్ చర్చలు
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు, కాగా.. బుధవారం భారత పార్లమెంట్ (Parliament)ను ఆయన సందర్శించారు.

దిశ, నేషనల్ బ్యూరో: మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు, కాగా.. బుధవారం భారత పార్లమెంట్ (Parliament)ను ఆయన సందర్శించారు. పార్లమెంట్ మొత్తం కలియతిరిగారు. అక్కడ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda)తో చర్చలు జరిపారు. అయితే, ఏ విషయంలో చర్చలు జరిపారో మాత్రం తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతుకుముందు మార్చి 17న న్యూఢిల్లీలోని కృషి భవన్ లో బిల్ గేట్స్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సహా వివిధ సమస్యలపై చర్చించారు. గేట్స్ ఫౌండేషన్ మద్దతు, నిబద్ధతకు చౌహాన్ ధన్యవాదాలు తెలిపారు. భారత్- గేట్స్ ఫౌండేషన్ మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయనిచెప్పుకొచ్చారు.
ఒప్పందం
వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వాతావరణ మార్పు చొరవలను విప్లవాత్మకంగా మార్చడానికి ఇండియా ఏఐ మిషన్(India AI Mission), గేట్స్ ఫౌండేషన్(Gates Foundation) త్వరలోనే ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేయనున్నాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇకపోతే, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ వంటి కీలక రంగాల కోసం ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేయడంపై ఇండియా ఏఐ మిషన్ దృష్టి పెడుతుంది.






