లుంగీతో పరారైన బంగ్లా మాజీ అధ్యక్షుడు

by Muthe.Rajitha |

బంగ్లాదేశ్(Bangladesh) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్(Mohammed Abdul Hamid) దేశాన్ని వదిలి పారిపోయినట్టు స్థానిక మీడియా కథనాలు వెలువరించింది.

లుంగీతో పరారైన బంగ్లా మాజీ అధ్యక్షుడు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్(Mohammed Abdul Hamid) దేశాన్ని వదిలి పారిపోయినట్టు స్థానిక మీడియా కథనాలు వెలువరించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 8న అబ్దుల్ హమీద్ థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ఢాకా(Dhaka)లోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి థాయిలాండ్‌(Thailand) లోని బ్యాంకాక్(Bangkok) కు గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారని సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా బంగ్లా సాధారణ పౌరుడిలా లుంగీ-గేజ్(Lungi-Gauge) ధరించి కుటుంబ సభ్యులతో సహా బ్యాంకాక్ కు ఉడాయించినట్టు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే హమీద్ గత హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు జరిగిన రిజర్వేషన్ల అల్లర్లలో ఓ వ్యక్తి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీ(ALP)పై నిషేధం విధించగా.. ఆ పార్టీ కీలక నేతలు దేశం నుంచి జారుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే హమీద్ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన వైద్య చికిత్స కోసం థాయ్ వెళ్లారని పేర్కొన్నారు.

Next Story