- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశీ విద్య మరింత ప్రియం.. ఇకపై UK లో ఏటా ఫీజుల పెంపు
విదేశీ విద్య ఇకపై తడిసి మోపెడు కానుంది. UKలో ఉన్నత విద్యకోసం వెళ్లే విద్యార్థులపై, వారి తల్లిదండ్రులపై అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ఆర్థిక కష్టాలలోకి నెట్టనుంది.

దిశ, వెబ్ డెస్క్ : విదేశీ విద్య ఇకపై తడిసి మోపెడు కానుంది. UKలో ఉన్నత విద్యకోసం వెళ్లే విద్యార్థులపై, వారి తల్లిదండ్రులపై అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ఆర్థిక కష్టాలలోకి నెట్టనుంది. ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఆధారంగా 026 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీలు తమ ట్యూషన్ ఫీజులను పెంచుకునేందుకు ఇంగ్లాండ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే యూనివర్సిటీలను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని యూకే విద్యాశాఖ మంత్రి బ్రిడ్జెట్ ఫిలిప్సన్ తెలిపారు.
అయితే, ఫీజుల పెంపుపై కొన్ని షరతులు ఉంటాయని.. ఉత్తమ బోధన, విద్యార్థులకు మెరుగైన ఫలితాలు ఇచ్చే యూనివర్సిటీలు మాత్రమే గరిష్ఠ ఫీజులు వసూలు చేయగలవని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల యూనివర్సిటీల్లో విద్యా నాణ్యత పెరుగుతుందని, విద్యార్థుల నైపుణ్యాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయని అన్నారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఇంగ్లాండ్ యూనివర్సిటీలు ఫీజులను పెంచాయి. ప్రస్తుతం ఒక విద్యా సంవత్సరానికి ఫీజు 9,535 పౌండ్లుగా ఉండగా.. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ ఫీజు మరింత పెరుగుతుంది.
2026లో ద్రవ్యోల్బణం ఇప్పటిలాగే ఉంటే, ఫీజు సుమారు 400 పౌండ్లు పెరిగి 9,900 పౌండ్లు దాటవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఖర్చులను తగ్గించడానికి గత ఏడాది సుమారు 12,000 ఉద్యోగాలను తొలగించాయి. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయం యూనివర్సిటీలకు ఊరటనిస్తుందని యూనివర్సిటీ యూకే యూనియన్ చెప్పింది.






