- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: దేశంలో కొన్ని 'శక్తులు' ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి: ప్రధాని మోడీ
ఫులే దంపతులను ఆదర్శంగా తీసుకొని తమ ప్రభుత్వం మహిళల విద్య, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదన్నారు

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని కొన్ని శక్తులు ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవాలని పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఆ శక్తులు 'పరివార్ కా సాథ్, పరివార్ కా వికాస్ '(కుటుంబంతో.. కుటుంబం కోసం) అజెండాను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఆ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ.. జ్యోతిబా ఫూలే జయంతిని గుర్తు చేస్తూ.. ఫులే దంపతులను ఆదర్శంగా తీసుకొని తమ ప్రభుత్వం మహిళల విద్య, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదన్నారు. సామాజిక సంస్కరణలకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. తమ ప్రభుత్వ మార్గదర్శక మంత్రమే 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్(అందరితో.. అందరి కోసం)' నినాదంతో ముందుకు వెళ్తోందన్నారు. ఎన్‌డీఏ నేతలంతా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారని చెప్పారు. కానీ, అధికారం కోసం చూస్తున్న వారు తమ కుటుంబం అభివృద్ధి మాత్రమే ఆలోచిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోడీ వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టుల కోసం శంకుస్థాపన చేశారు. ఇందులోనూ గ్రామీణాభివృద్ధికే తాము పెద్దపీట వేశామన్నారు. వాటిలో 130 తాగునీటి ప్రాజెక్టులు, నాలుగు గ్రామీణ రోడ్లు, 100 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు, 356 లైబ్రరీలు, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉన్నాయని పేర్కొన్నారు.






