- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: ఫుడ్ ఆర్డర్ ఆలస్యం.. జొమాటో డెలివరీ బాయ్‌పై దాడి.. వీడియో వైరల్
ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి చేసిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral video) ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి చేసిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు తాజాగా దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..? (Bengaluru) బెంగళూరులోని శోభా థియేటర్ (Shobha Theatre) సమీపంలో.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టగా, కాస్త ఆలస్యంగా (Zomato delivery boy) డెలివరీ బాయ్ వచ్చాడు. దీంతో ఆర్డర్ ఎందుకు లేటుగా వచ్చావంటూ అతనిపై ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. వర్షంతో పాటు ట్రాఫిక్ సమస్యతో ఆలస్యమైందని చెప్పినా.. వినిపించుకోకుండా అతనిపై దాడి చేశారు. బైక్ పై డెలివరీ బాయ్ కూర్చోని ఉండగా.. మొదటి వ్యక్తి ప్లాస్టిక్ వాటర్ డబ్బాతో తీవ్రంగా దాడి చేశాడు. మరో వ్యక్తి కూర్చీతో ఆతన్ని తీవ్రంగా కొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
బెంగళూరు పోలీసులు జోక్యం చేసుకుని జొమాటో డెలివరీ బాయ్, ఇద్దరు వ్యక్తుల నుంచి స్టేట్‌మెంట్‌లు తీసుకున్నారు. డెలివరీ బాయ్ స్టేట్‌మెంట్ ప్రకారం.. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. నిందితులపై నెటిజన్‌లు మండిపడ్డారు. వర్షం పడితే ట్రాఫిక్‌తో ఆలస్యం అవుతుందని, ఇలాంటి విషయంలో కొట్టడం తగదని డెలివరీ ఆలస్యం అయితే కస్టమర్‌కేర్‌కు కాల్ చేసి కంప్లైట్ ఇవ్వొచ్చని నెటిజన్‌లు కామెంట్స్ చేశారు. వీడియో లింక్..






