ఉగ్ర సంస్థగా ‘ముస్లిం బ్రదర్‌హుడ్’.. ఫ్లోరిడా స్టేట్ గవర్నర్ సంచలన ప్రకటన

by Kema Shiva Kumar |

ఫ్లోరిడా స్టేట్ గవర్నర్ రాన్ డిసాంటిస్ (Governor Ron DeSantis) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉగ్ర సంస్థగా ‘ముస్లిం బ్రదర్‌హుడ్’.. ఫ్లోరిడా స్టేట్ గవర్నర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్లోరిడా స్టేట్ గవర్నర్ రాన్ డిసాంటిస్ (Governor Ron DeSantis) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ముస్లిం బ్రదర్‌హుడ్ (Muslim Brotherhood), కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR) సంస్థలను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లుగా గవర్నర్ రాన్ డిసాంటిస్ వెల్లడించారు. అదేవిధంగా ఫ్లోరిడాలోని అన్ని రాష్ట్ర ఏజెన్సీలు బ్యాన్ చేసిన ఆ రెండు సంస్థలకు ఎలాంటి ఆర్థిక సాయం, వనరులు అందించకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

కాగా, 1920లలో ఈజిప్టు (Egypt)లో పుట్టిన ముస్లిం బ్రదర్‌హుడ్ పేరుతో చలామణి అవుతోన్న ఇస్లామిస్ట్ సంస్థ ఆయా దేశాల్లో రహస్యంగా పనిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. హమాస్ వంటి ఉగ్రవాద మూకలతో సంబంధాలున్నాయని ఫ్లోరిడా పోలీసులు పేర్కొన్నారు. ఇక పౌర హక్కుల కోసం పోరాడే సంస్థ కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR)కు ఉగ్రవాదంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) గత నెలలోనే ముస్లిం బ్రదర్‌హుడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించేందుకు స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్‌లను ఆదేశించిన విషయం తెలిసిందే.

Next Story