- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌ను వణికిస్తున్న వరదలు..51 మంది మృతి
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కొద్దిరోజులుగా అక్కడ కుండపోత వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కొద్దిరోజులుగా అక్కడ కుండపోత వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరదల కారణంగా ఇప్పటి వరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా, 22 మంది గల్లంతయ్యారని అధికారులు ప్రకటించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రాష్ట్రంలో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విపత్తుపై ఓ నివేదికను విడుదల చేసింది. జూన్ 20 నుండి జులై 2వ తేదీ వరకు జరిగిన నష్టాన్ని నివేదికలో పొందుపర్చింది. ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడటం లాంటి ప్రమాదాల వల్ల 12 జిల్లాల్లో మరణాలు సంభవించాయని తెలిపింది. సుమారు 103 మంది గాయపడ్డారని వెల్లడించింది. మండీ జిల్లాలో అత్యధికంగా 10 మంది మరణించారని పేర్కొంది.






