- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Floods: అమెరికాలోని టెక్సాస్‌లో వరద బీభత్సం.. 27 మంది మృతి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు సంభవించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ కారణంగా పలు ఘటనల్లో 9 మంది పిల్లలు సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్‌లోని కెర్ కౌంటీలోని షెరీఫ్ కార్యాలయం, శాన్ ఆంటోనియోకు వాయువ్యంగా 85 మైళ్ల దూరంలో ఉన్న గ్వాడాలుపే నది చుట్టూ ఉన్న ప్రాంతంలో వరదలు వచ్చాయని అధికారులు తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే నదిలోని నీటి మట్టం 7 అడుగుల నుంచి 29 అడుగులకు చేరినట్టు వెల్లడించారు. అయితే శనివారం వరద తగ్గుముఖం పట్టినా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. విపత్తు వల్ల ప్రభావితమైన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.






