ఉప్పొంగిన యమున.. దేశ రాజధానిలో వరదలు.. 48 గంటల్లో నగరం మునిగిపోయే ప్రమాదం?

by Naga Rani Yarlagadda |

ఉత్తర భారతంలో కురుస్తోన్న భారీ వర్షాలకు ఢిల్లీలోని యమునా నది (Yamuna Floods) ఉప్పొంగింది.

ఉప్పొంగిన యమున.. దేశ రాజధానిలో వరదలు.. 48 గంటల్లో నగరం మునిగిపోయే ప్రమాదం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర భారతంలో కురుస్తోన్న భారీ వర్షాలకు ఢిల్లీలోని యమునా నది (Yamuna Floods) ఉప్పొంగింది. స్థానికంగానూ ఎడతెరపిలేని వర్షాలు కురుస్తుండటంతో యమునా ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో.. అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఎన్సీఆర్ (Delhi - NCR Floods) పరిధిలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లలోకి వరదనీరు చేరింది. ప్రధాన రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఢిల్లీలో జనజీవనం స్తంభించింది.

ఈ తెల్లవారుజామున నది నీటిమట్టం 205.33 మీటర్లు దాటడంతో భారీ వరదలు సంభవించే అవకాశం ఉన్నదంటూ సీఎం కార్యాలయం లోతట్టు ప్రాంతాలారిని అప్రమత్తం చేసింది. అందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా వరదనరు విడుదలవుతుండగా.. 36-48 గంటల్లో రాజధాని నగరమంతా వరదలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

కాగా.. 2 గంటలపాటు ఎడతెరపి లేని వర్షం కురవగా.. ఢిల్లీ - జైపుర్ హైవేపై 7-8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 3 గంటలపాటు ట్రాఫిక్ లోనే చిక్కుకున్నామని పలువురు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Next Story