- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Himachal Floods: హిమాచల్‌లో వరద నష్టం రూ. 900 కోట్లుగా అంచనా
దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా నీటిపారుదల, ప్రజారోగ్యం (ఐపీహెచ్), పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ), రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలకు రూ. 900 కోట్ల విలువైన నష్టం వాటిల్లిందని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలను హై అలర్ట్ చేసింది. సెప్టెంబర్ వరకు ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసి ఆదేశాలు జారీ చేసింది. రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నందున, ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భవిష్యత్తులో సహాయం కోసం హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ ప్రకటనలో సీఎం సుఖు మాట్లాడుతూ.. 'ప్రజలు తాము కోల్పోయిన వారి కుటుంబసభ్యుల మృతదేహాలను చూడాలనుకుంటున్నారు. వారి బాధతను అర్థం చేసుకుని రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అవసరమైన అన్ని కార్యకలాపాలను కొనసాగిస్తున్నాము. ఇప్పటికీ 33 మంది ఆచూకీ లభించాల్సి ఉందనీ ఆయన తెలిపారు. సెప్టెంబరు వరకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని, పరిస్థితిని నిర్వహించడానికి అధికారులు, డిప్యూటీ కమిషనర్లు రోజువారీ సమావేశాలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.