- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన ఫ్లైట్.. తప్పిన పెను ప్రమాదం
రన్‌వే నుంచి విమానం పక్కకు దూసుకెళ్లిన భయానక ఘటన నేపాల్ (Nepal)లో శుక్రవారం అర్ధరాత్రి చోటచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రన్‌వే నుంచి విమానం పక్కకు దూసుకెళ్లిన భయానక ఘటన నేపాల్ (Nepal)లో శుక్రవారం అర్ధరాత్రి చోటచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖాట్మండు నుంచి భద్రాపూర్ (Bhadrapur) చేరుకున్న బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ATR-72 విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే పైనుంచి పక్కకు దూసుకెళ్లింది. దాదాపు రన్‌వే దాటి సుమారు 200 మీటర్ల దూరం ఫ్లైట్ ముందుకు దూసుకెళ్లి సమీపంలోని గడ్డి పొదల్లో నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 51 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.
అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి కిందకు దించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు. రన్‌వే దాటి మట్టిలోకి దూసుకెళ్లడంతో విమానానికి స్వల్పంగా నష్టం వాటిల్లింది. సాంకేతిక లోపం లేదా వాతావరణ పరిస్థితులే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAAN) దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతానికి భద్రాపూర్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.






