- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో విమాన కార్యకలాపాలు పునఃప్రారంభం
అహ్మదాబాద్ విమానాశ్రయం ( Ahmedabad Airport ) తిరిగి ప్రారంభమైంది. అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమాన

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ విమానాశ్రయం ( Ahmedabad Airport ) తిరిగి ప్రారంభమైంది. అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు పునః ప్రారంభమయ్యాయి. ఎయిర్ ఇండియా ప్రమాదం వల్ల తాత్కాలికంగా... అహ్మదాబాద్ విమానాశ్రయం మూసివేసిన సంగతి తెలిసిందే. దింతో దాదాపు నాలుగు గంటల పాటు.. అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమాన సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు.
దాదాపు నాలుగు గంటల సమయం తర్వాత విమాన సేవలు తిరిగి ప్రారంభించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేసింది. దీంతో అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ఎప్పటిలాగే ప్రారంభమయ్యాయి. దీంతో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది ఇలా ఉండగా.. ఇవాళ సరిగ్గా మధ్యాహ్నం పూట.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్ప కూలింది. దాదాపు 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం సాంకేతిక కారణాల వల్ల... టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ఈ సంఘటన నేపథ్యంలో దాదాపు 100కు పైగా మంది మరణించినట్లు చెబుతున్నారు.






