Garba: విమానం ఆలస్యం.. ఎయిర్ పోర్టులోనే గర్బా నృత్యం (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2025-09-30 07:16:51  IST  )

విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే గర్బా నృత్యం చేశారు ప్రయాణికులు

Garba: విమానం ఆలస్యం.. ఎయిర్ పోర్టులోనే  గర్బా నృత్యం (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే గర్బా నృత్యం (Garba dance) చేస్తూ కాలక్షేపం చేసిన ఘటన గోవా ఎయిర్ పోర్టులో జరిగింది. ఇటీవల గోవా నుంచి సూరత్ కు వెళ్లే ఇండిగా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆలస్యం అయింది. పైలట్ అనారోగ్య కారణంతో ఈ డీలే జరిగింది. ఈ క్రమంలో తాను గర్బా ఆడేందుకు సూరత్ వెళ్లాలనుకున్నానని ప్రయాణికుల్లో మయూర్ అనే వ్యక్తి అక్కడి సిబ్బందితో చెప్పి వాపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న ఇండిగో (Indigo Airline) సిబ్బంది ఎయిర్ పోర్టులోనే స్పీకర్స్ ఏర్పాటు చేయగా అక్కడ ఉన్న ప్రయాణికులు అందరూ కలిసి గర్బా నృత్యం ఆడారు. ప్రయాణికులతో పాటు ఇండిగో సిబ్బంది సైతం పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా విమానాలు ఆలస్యం జరిగితే ప్రయాణికులు చిటపటలాడిపోతుంటారు. అలాంటిది ఇక్కడ మాత్రం కొంత నిరుత్సాహం ఏర్పడినా గర్బా నృత్యం ఆస్వాదించడం ఇది మరిచిపోలేని అనుభూతి ఇచ్చిందని ప్రయాణికులు చెబుతున్నారు.

Next Story