- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India: ప్రమాదానికి ముందు విమానంలో దిగ్భ్రాంతికర పరిస్థితి!.. ఎయిరిండియా నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం?
విమానం ప్రమాదంపై సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా (Airindia) బోయింగ్ 787-8 విమాన ప్రమాదంపై సంచల విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ ప్రమాదానికి ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వల్లే జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం మెయింటెనెన్స్‌లో ఎయిర్ ఇండియా చూపిన నిర్లక్ష్యం (Airindia Negligence) వల్లే ప్రమాదం జరిగిందని ఏ మాత్రం శ్రద్ధ వహించినా వందలాది మంది ప్రాణాలు నిలిచేవనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ప్రమాదం జరిగిన విమానం పలుమార్లు మొరాయించిందని గడిచిన ఏడాది కాలంలో రెండు సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. గత జూన్‌లో ఈ విమానానికి ప్రమాదం తప్పిందని గత డిసెంబర్‌లో ఇదే ఫ్లైట్‌లో పొగలు వచ్చాయని దీనిపై డీజీసీఏ అలర్ట్ చేసినా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదని తెలుస్తోంది. గత వారం ప్యారిస్ వెళ్తుండగా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది.
విమానంలో దారుణ పరిస్థితి...
ఈ విమానం ప్రమాదానికి ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చింది. ఆకాశ్ అనే ప్రయాణికుడు వీడియో తీసి నేను ట్యాక్సీలో కూర్చున్నట్లుగా ఉంది. ఇందులో ఏసీలు పని చేయడం లేదు. ఉక్కపోత భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. సీట్ ముందున్న టీవీ స్క్రీన్‌లు, విమాన సిబ్బందితో మాట్లాడే పరికరం బటన్స్, సీటుపైన ఉండే లైట్లు ఏవీ పని చేయడం లేదు. అంతా అస్తవ్యస్తంగా ఉందని ఆకాశ్ వీడియోలో నిలదీశారు. ఇలాంటి విమానాన్ని ఎలా నడుపుతున్నారంటూ వీడియో ద్వారా ఎయిర్ ఇండియాను ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.అయితే ఈ వీడియో ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించినదేనా అనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.






