- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన రూ.12 కోట్ల విలువైన బంగారం.. వీధుల్లో జనాల వెతుకులాట!
మహిళలకు బంగారంపై (Gold) ఉండే ఇష్టం గురించి అందరికి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: మహిళలకు బంగారంపై (Gold) ఉండే ఇష్టం గురించి అందరికి తెలిసిందే. కానీ గోల్డ్ రేట్లు కలలో కూడా కొనలేని విధంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.లక్ష దాటేసింది. ఇలాంటి సమయంలో ఒక గ్రాము బంగారాన్ని పొగొట్టుకున్న ఆ బాధ వర్ణానాతీతం అనే చెప్పాలి. అలాంటిది ఏకంగా రూ.12 కోట్ల విలువైన బంగారం వరదల్లో కొట్టుకుపోతే? షాక్ అవుతున్నారు కదా! కానీ నిజంగానే చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో 20 కేజీల బంగారం, వెండి ఆభరణాలు వరదల్లో కొట్టుకుపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
చైనాలో (China) గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ క్రమంలో షాంగ్జీ ప్రావిన్స్‌లో ఉన్న వుచీ కౌంటీలోని లావోఫెంగ్‌షియాంగ్ (Laofengxiang) అనే బంగారు ఆభరణాల షాపు నుంచి 20 కిలోల బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. జులై 25న ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ వార్త బయటికి రాగానే అక్కడి స్థానికులు ఆభరణాల కోసం రోడ్లపై వెతకటం ప్రారంభించారు. దీంతో అక్కడ గోల్డ్ రష్ వాతావరణం నెలకొంది. కొందరు అయితే మెటల్ డిటెక్టర్ల సాయంతో వెతికారు.
షాపు యజమాని యే (Ye) తెలిపిన సమాచారం ప్రకారం.. జులై 25న ఉదయం షాపు తెరవడానికి సిద్ధమవుతున్న సమయంలోనే వరద హెచ్చరికలు వచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ముందు ద్వారం గుండా నీరు షాపులోకి ప్రవేశించింది. నీటి ఉధృతికి డిస్‌ప్లే క్యాబినెట్లు, ట్రేలలో ఉన్న ఆభరణాలు అన్నీ కొట్టుకుపోయాయి. అయితే, సిబ్బంది ముందు రోజు రాత్రి షాపులోనే ఉండిపోవటంతో ఆభరణాలను లాకర్లలో భద్రపర్చలేకపోయారు. తప్పిపోయిన వాటిలో బంగారు గొలుసులు, గాజులు, ఉంగరాలు, డైమండ్ రింగులు, జేడ్ ఆభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. ఈ మొత్తం ఆభరణాల విలువ 10 మిలియన్ యువాన్ (భారత రూపాయలలో సుమారుగా రూ.12 కోట్లు)గా వెల్లడించారు.
వరద తగ్గిన తర్వాత కుటుంబసభ్యులు, దుకాణ సిబ్బంది రెండు రోజులపాటు ఆ ప్రాంతాన్ని గాలించి, మట్టిలో వెతికారు. కానీ, ఇప్పటివరకు ఒక కిలో ఆభరణాలు మాత్రమే తిరిగి దొరికాయి. కొంతమంది స్థానికులు స్వచ్ఛందంగా కొన్ని వస్తువులు తిరిగి ఇచ్చారు. ఈ వార్త ప్రజల్లోకి వెళ్ళిన వెంటనే, స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆభరణాలను వెతకడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






