- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nepal: నేపాల్-చైనా సరిహద్దులో వరద బీభత్సం
తెల్లవారుజామున వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఇప్పటివరకైతే ప్రాణనష్టం, క్షతగాత్రుల గురించి ఎటువంటి వివరాలు వెలువడలేదు.

దిశ, నేషనల్ బ్యూరో: చైనా, నేపాల్ సరిహద్దులో ఉన్న భోటెకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ముఖ్యమైన మిటేరి వంతెన కొట్టుకుపోయింది. అంతేకాకుండా ఆ నదికి ఆనుకున్న ఉన్న డ్రై పోర్టులోని వాహనాలన్నీ కొట్టుకుపోయాయని అధికారులు మంగళవారం తెలిపారు. దాదాపు 200 వాహనాలు కొట్టుకుపోయినట్టు రసువా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అర్జున్ పాదెల్ చెప్పారు. చైనాలో భారీ వర్షపాతం కారణంగా వరదలు పోటెత్తాయి. నేపాల్‌లో ఉన్న తైమూర్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం తెల్లవారుజామున వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఇప్పటివరకైతే ప్రాణనష్టం, క్షతగాత్రుల గురించి ఎటువంటి వివరాలు వెలువడలేదు. నేపాల్‌కు చెందిన చాలామంది వ్యాపారులు, 12 మంది నేపాల్ పోలీసులు వరదల్లో చిక్కుకున్నారు. స్థానిక అధికారులు ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. నీటి మట్టం అధికంగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆధికారులు వెల్లడించారు. 'స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వరద ఆ ప్రాంతాన్ని తాకింది. డ్రై పోర్టు వెంబడి ఆపి ఉంచిన వాహనాల్లో నిద్రిస్తున్న వారు వరదలో కొట్టుకుపోయారని మాకు సమాచారం అందింది' అని అర్జున్ తెలిపారు. మరోవైపు, నేపాల్‌లోనే త్రిశూలి నదికి కూడా వరదలు వచ్చే అవకాశం ఉందనే సందేహంతో తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.






