- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SHOCKING: పైకి ప్రభుత్వ ఉద్యోగులు.. ఉగ్రవాద సంస్థలతో లింక్.. ఐదుగురి బండారం బట్టబయలు
ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో దాడులు చేసేందుకు ఉగ్రమూకల ప్రయత్నాలు ఆపడం లేదు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో దాడులు చేసేందుకు ఉగ్రమూకల ప్రయత్నాలు ఆపడం లేదు. దేశంలో చిచ్చు రాజేసేందుకు నిత్యం ఏదోరకంగా ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రసంస్థలు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులను తమ టచ్ లోకి తీసుకుంటున్నాయి. తాజాగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) వ్యవహారం జమ్మూకశ్మీర్‍లో (Jammu and Kashmir) మరోసారి కలకలం రేపింది. ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు (Terror Links) ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇవాళ వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Lieutenant Governor Manoj Sinha) ఉత్తర్వులు జారీ చేశారు.
పైకి ఉపాధ్యాయుడు లోపల ఉగ్ర ఆలోచనలు:
విరిలో ఉపాధ్యాయుడు మొహమ్మద్ ఇష్ఫాక్, ల్యాబ్ టెక్నీషియన్ తారిక్ అహ్మద్ షా, అసిస్టెంట్ లైన్‌మన్ బషీర్ అహ్మద్ మిర్, అటవీ శాఖ ఫీల్డ్ వర్కర్ ఫారూక్ అహ్మద్ భట్, ఆరోగ్య శాఖ డ్రైవర్ మొహమ్మద్ యూసఫ్ ఉన్నారు. మొహమ్మద్ ఇష్ఫాక్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా (LeT) కోసం పని చేస్తున్నట్టు తేలింది. అతడు పొరుగు దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న “ఉగ్రవాది”గా గుర్తింపు పొందిన LeT కమాండర్ మొహమ్మద్ అమిన్ అలియాస్ అబు ఖుబైబ్తో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.






