- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ హైలెవెల్ మీటింగ్.. ఐదుగురు సీఎంలు గైర్హాజరు!
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ వర్చువల్‌గా ప్రధాని మోడీ సమావేశం కావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ వర్చువల్‌గా ప్రధాని మోడీ సమావేశం కావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇరాన్ - ఇజ్రాయెల్ - అమెరికా వార్ నేపథ్యంలో తలెత్తుతున్న పరిస్థితులు, దేశంపై ప్రభావాన్ని ముఖ్యమంత్రులకు వివరించనున్నారు. అయితే అనూహ్యంగా ఈ కీలక సమావేశానికి ఐదుగురు ముఖ్యమంత్రులు గైర్హాజరు కాబోతున్నారు. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు హాజరు కాలేమని ముందుగా సమాచారం ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఇవాళ్టి భేటీలో ప్రధాని మోడీ.. హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడం వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ చర్యలు అమలు జరిగేలా చూడటంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని కోరబోతున్నారు. అలాగే ఇంధన, నిత్యావసర వస్తువుల సరఫరా సజావుగా సాగేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులకు వివరించబోతున్నారు. టీమ్ ఇండియాలాగా కలిసిగట్టుగా ఉంటే ఏ సమస్యను అయినా ఎదుర్కోగలం అని సంకేతాన్ని ముఖ్యమంత్రులకు మోడీ వివరించనున్నారు.






