- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్ దాడుల్లో ఐదుగురు అల్‌జజీరా జర్నలిస్టులు మృతి
ఇజ్రాయెల్ దాడుల్లో ఐదుగురు అల్‌జజీరా జర్నలిస్టులు మృతి. వారిలో ఒకరిని టెర్రరిస్టుగా ప్రకటించిన ఇజ్రాయెల్ మిలిటరీ!

దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు దుర్మరణం పాలయ్యారు. గాజాలోని అల్ షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే మరణించిన వారిలో ఒకరు హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించడం. అల్-షిఫా ఆసుపత్రి మెయిన్ గేట్ బయటకు ఉన్న ప్రెస్ టెంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిందని అల్ జజీరా మీడియా సంస్థ తెలిపింది.
ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. అందులో ఐదుగురు తమ పాత్రికేయులేనని పేర్కొంది. అల్ జజీరా కరస్పాండెంట్స్ అనాస్ అల్ షరీఫ్, మహమ్మద్ ఖ్రీకె, కెమెరామెన్‌లు ఇబ్రహీం జహీర్, మోమెన్ అలివా, మహ్మద్ నౌఫల్ మరణించినట్లు సంస్థ తెలిపింది. ఈ దాడులు చేసిన తర్వాత అనాస్ అల్ షరీఫ్ ఓ ఉగ్రవాది అని, అతడు హమాస్ టెర్రరిస్ట్ సెల్‌కు హెడ్‌గా పనిచేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఆరోపించింది.






